యూఏఈ డీల్‌తో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్‌లో కొనుగోళ్లు

యూఏఈ డీల్‌తో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్‌లో కొనుగోళ్లు


రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్.. యూఏఈకి చెందిన ముబదల డెవలప్మెంట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించింది. అడ్వాన్స్‌డ్ ఏరోస్పేస్ తయారీకి సంబంధించి ఈ ఒప్పందం కుదిరింది.

ఈ మేరకు ఎక్స్‌ఛేంజ్‌లకు సమాచారాన్ని అందించింది రిలయన్స్ ఇన్ఫ్రా. ప్రపంచంలోని అత్యుత్తమ ఏరోస్పేస్ కంపెనీల్లో ఒకటిగా ఎదగాలన్నది ముబదలకు చెందిన స్ట్రాటా మాన్యుఫాక్చరింగ్ పీజీఏసీ లక్ష్యం. ఈ ఒప్పందంలో భాగంగా నాగ్‌పూర్‌లోని ధీరూబాయ్ అంబానీ ఏరోస్పేస్ ‌పార్క్‌ను ఉపయోగించుకోనున్నారు.

ఈ ఒప్పందం ప్రభావంతో రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ ధర బీఎస్ఈలో 1.26 శాతం పెరిగి రూ. 548.40కు చేరుకుంది.Most Popular