లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు


స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, ఐటీ సెక్టార్లలో జోరుగా కొనుగోళ్లు కనిపింస్తుండడంతో.. ఈ రంగాల్లోని షేర్లు పరుగులు తీస్తున్నాయి.

టీసీఎస్, ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌లు టాప్ గెయినర్స్‌గా ఉండగా.. ఐటీసీ, అల్ట్రాటెక్ సిమెంట్, భారతి ఎయిర్‌టెల్ షేర్లలో అమ్మకాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం సెన్సెక్స్ 67 పాయింట్ల లాభంతో 28,223 దగ్గర ఉండగా.. నిఫ్టీ 18 పాయింట్లు పెరిగి 8,742 దగ్గర ట్రేడవుతోంది. Most Popular