అన్ని రంగాలూ నష్టాల్లోనే

అన్ని రంగాలూ నష్టాల్లోనే

ఎఫ్ఎంసీజీ మినహాయిస్తే, మరే రంగం కూడా పాజిటివ్‌గా ముగియలేదు. ఆ సెక్టార్‌ కూడా స్వల్ప లాభాలతో సరిపుచ్చుకోగా.. ప్రధానంగా ఆటో సెక్టార్ మార్కెట్ల నష్టాలను లీడ్ చేసింది. వాహన రంగానికి హెల్త్ కేర్, కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, పీఎస్‌యూ రంగాల్లోని షేర్లు మరింతగా మద్దతు పలికాయి. 

 

బీఎస్ఈ బెంచ్ మార్క్ ఇండెక్స్‌ సెన్సెక్స్ 0.65 శాతం క్షీణించి 183.75 పాయింట్ల నష్టంతో 28,155.56 దగ్గర ముగియగా.. నిఫ్టీ 0.77 శాతం నష్టపోయి 67.60 క్షీణించి చివరకు 8,724.70 దగ్గర క్లోజయింది. 94.40 పాయింట్లు నష్టపోయిన బ్యాంక్ నిఫ్టీ 20,163.70 పాయింట్ల దగ్గర ముగిసింది. 

 

ఇవాల్టి ట్రేడింగ్‌లో భారతీ ఇన్ఫ్రాటెల్(1.57%), జీ ఎంటర్టెయిన్మెంట్(+1.51%), ఐటీసీ(+0.96%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(+0.85%), బజాజ్ ఆటో(+0.41%) షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. టాటా మోటార్స్ డీవీఆర్(-9.89%), టాటా మోటార్స్(-9.46%), సన్ ఫార్మా(-4.04%), అరబిందో ఫార్మా(-3.39%), బీహెచ్ఈఎల్(-3.37%)లు టాప్ లూజర్స్‌గా నిలిచాయి. 

 Most Popular