స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ

స్టాక్ మార్కెట్లలో అమ్మకాల వెల్లువ


గ్లోబల్ ఇండెక్స్‌లలో సానుకూల ధోరణి కనిపించినా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో మన మార్కెట్లు మాత్రం నష్టాలను చవిచూశాయి. అమెరికా, ఆసియా మార్కెట్ల పాజిటివ్ సెంటిమెంట్‌తో స్పల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ.. కొంతసేపటిలోనే నష్టాల్లోకి జారుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో ఆటోమొబైల్ సెక్టార్.. ప్రధానంగా టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్‌లు మార్కెట్ల నష్టాలను లీడ్ చేశాయి.

అక్కడి నుంచి ఏ స్థాయిలోను ఇండెక్సులు పాజిటివ్ జోన్‌లోకి రాలేకపోయాయి. మిడ్ సెషన్ వరకూ నిలకడగా ఉన్న ఇండెక్స్‌లు ఆ తర్వాత నష్టాలను మరింతగా పెంచుకున్నాయి. ఐరోపా మార్కెట్ల సానుకూల ప్రారంభం కూడా.. సూచీలను లాభాల్లోకి చేర్చలోకి పోయింది. అన్నిరంగాల్లోనూ అమ్మకాలు వెల్లువెత్తడంతో.. సూచీలు చివరకు నెగిటివ్ జోన్‌లోనే ముగిశాయి.Most Popular