సగానికి తగ్గిన జిందాల్ స్టీల్ నష్టాలు

సగానికి తగ్గిన జిందాల్ స్టీల్ నష్టాలు


2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను జిందాల్ స్టీల్ అండ్ పవర్.. మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ కాలానికి గాను రూ. 407.44 నష్టాలు చవిచూసినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో సంస్థ నష్టాలు రూ. 869.73 కోట్లుగా నమోదయ్యాయి.

మొత్తం ఆదాయం రూ. 4336.05 కోట్ల నుంచి రూ. 5,407.87 కోట్లకు పెరగడంతో నష్టాల భారం తగ్గిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మెటీరియల్ ఖర్చులు, అదనపు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

రుణ భారం తగ్గించుకునేందుకు గత కొంతకాలంగా ఆస్తులను విక్రయించాలన్న జిందాల్ స్టీల్ ప్రణాళిక.. సానుకూల ఫలితాలు ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ స్టాక్ ధర 1.99 శాతం పెరిగి  రూ. 89.80 దగ్గర ట్రేడవుతోంది. Most Popular