జయహో ఇస్రో.. కొత్త చరిత్ర

జయహో ఇస్రో.. కొత్త చరిత్ర


ఇస్రో మరో కొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 104 శాటిలైట్స్‌ను నింగిలోకి ప్రవేశపెట్టే ప్రయోగం పీఎస్‌ఎల్‌వీ-సీ 37 ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ  ప్రయోగంతో అగ్రదేశాల సరసన చేరింది భారత్. ప్రయోగం ముగిసిన తర్వాత ఇస్రో ఛైర్మన్ కిరణ్ కుమార్ శాస్త్రవేత్తల కృషిని అభినందించారు.

సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్‌ నుంచి పీఎస్ఎల్‌వీ-సీ 37 ద్వారా.. ఇవాళ ఉదయం  9.28కు నింగిలోకి ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపారు. వీటిలో భారత్‌కు చెందిన 3 ఉపగ్రహాలు కూడా ఉన్నాయి. పీఎస్ఎల్‌వీ-సీ 37 విజయవంతం కావడంపై.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందనల్లో ముంచెత్తారు ప్రధాని మోడీ. Most Popular