సిఎం ఉండగానే మరో సిఎం ఎలా?

సిఎం ఉండగానే మరో సిఎం ఎలా?

తమిళనాడు పాలిటిక్స్ ప్రస్తుతం విచిత్రమైన స్థితిలో ఉన్నాయ్. ఓ వైపు శశికళపై జైలుశిక్ష పడటంతో మిగిలి ఉన్న అన్నాడిఎంకే నేతల్లో ఎవరు సిఎం అవుతారనే విషయం ఆసక్తి కలిగించకమానదు. మొదట్నుంచీ ఈ ఎపిసోడ్‌ని చూస్తే, ఫిబ్రవరి 5న పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం దాన్ని గవర్నర్ విద్యాసాగర్ రావ్ ఆమోదించడం జరిగిపోయాయ్. ఈ విషయాన్ని కన్వీనియంట్‌గా మర్చిపోతామంటే కుదరదు( కొంతమంది అక్కడ ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీలేదంటూ కామెంట్ చేస్తున్న నేపధ్యం కూడా గమనించాలి). కొత్త శాసనసభాపక్షనేత ఎన్నికయ్యేంతవరకూ ముఖ్యమంత్రిగా కొనసాగాలనే రాజ్యాంగపరంగా గవర్నర్ ఆయనకి సూచించారు. ఐదేళ్ల టర్మ్ ముగిస్తుండగా ఎన్నికలకు ముందు ఆర్నెల్ల ముందు ఉన్న ముఖ్యమంత్రి ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా మార్చబడతారు. వారికి అధికారాల్లో కూడా కోత పడుతుందంటారు. అలాంటప్పుడు కుర్చీ ఖాళీ లేదని వాదిస్తున్నవారి ప్రకారం ఇప్పుడు గవర్నర్ పళనిస్వామినో..ఇంకో సెంగోట్టియన్నో..ఇంకో నంబియార్‌నో బలం నిరూపించుకోవాలని పిలవాలంటే ఓ ముఖ్యమంత్రి ఉండగానే..మరో వ్యక్తిని తన బలం నిరూపించుకోమని పిలవాలి. 
అంటే మొదట బ్యాటింగ్ చేసే ఛాన్స్ పన్నీర్ సెల్వానికే ఇవ్వాలి. సాధారణంగా ఇలా మొదటి అవకాశం లభించడంలోని సౌలభ్యం ఏంటో పాలిటిక్స్‌ని ఫాలో అయ్యేవాళ్లకి త్వరగానే తత్వం బోధపడుతుంది. ఆయన ఫెయిలైన పక్షంలోనే కొత్త వ్యక్తికి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానించాలి. లేదంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవంటూ(మనకి) అనుకూలమైన పరిస్థితిలు నెలకొ    నేవరకూ రాష్ట్రపతిపాలన విధించాలంటూ సిఫార్సు చేస్తారు. ఇలాంటప్పుడే తమిళనాడులో పవర్ పగ్గాలు డిఎంకే తలుపు తట్టే ఛాన్స్ వస్తుంది. నాకూ ఎమ్మెల్యేల మద్దతు ఉంది..రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యానో లేక జనంపై ఎన్నికల భారం మోపకూడదనో..ఇంకో సాకో చూపించి మాకూ ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్సివ్వమని స్టాలిన్ అడగవచ్చు

ఈ పరిణామాలు ఎందుకు తలెత్తాయో సులభంగానే అర్ధం అవుతాయ్. పన్నీర్ సెల్వం రాజీనామాని అంగీకరించినా..అంగీకరించకపోయినా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాని, అధికారపక్షం కానీ వారంరోజులు లేకుండా పోవడానికి కారణం గవర్నర్ తాత్సారమే. శశికళ దోషో, నిర్దోషో కోర్టులు నిర్ణయిస్తాయ్. అప్పటిదాకా వేచి చూడటానికి రాజ్యాంగంలో ఎక్కడా వెసులుబాటు లేదు. అసలు తీర్పు ఇవాళ వచ్చింది కాబట్టి సరే కానీ..వాయిదా పడి ఉంటే ఈ కొండాటకం ఎన్నాళ్లు నడిచేదో మరి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, లేదు ఫుల్ టైమ్ సిఎం అనడానికి అసలు తమిళనాడుకి ఫుల్ టైమ్ గవర్నర్ కూడా కాదు..ఆయనా ఇన్‌ఛార్జ్ గవర్నరే! ఈ ఒక్క పాయింట్ చాలు తమిళనాడు విచిత్రరాజకీయం తేలిపోవడానికి. పొరుగురాష్ట్రమైన మనకే ఇంత అర్ధమవుతుంటే..తమిళతంబిలకు తెలీదా, తమపై ఎంతమాత్రం ఇతరుల పెత్తనం సంగతి పక్కనుంచి, పొడేగిట్టని అడ్డలుంగీ బ్యాచ్ బిజెపి చేస్తోన్న రాజకీయాన్ని అంత త్వరగా మర్చిపోరనీ..ఇంతకింతా తీర్చుకుంటారని జల్లికట్టు నేపధ్యం హెచ్చరిస్తోందిMost Popular