అందంపై పందెం

అందంపై పందెం

చక్కని మోడల్‌లా కన్పిస్తున్న ఈ అందగత్తె లక్ష్యం సామాన్యమైనది కాదు. ఓ జేమ్స్‌బాండ్ మూవీలో హీరోయిన్లా ఈమెకీ ఓ లక్ష్యం ఉంది..అదేంటే తెలుసా, లోకాన్ని గడగడలాడిస్తోన్న టెర్రరిస్ట్ సంస్థని నామరూపాల్లేకుండా చేయడం. ఈమె పేరు జోయన్నా పలానీ, దేశం డెన్మార్క్ ఇంతకీ ఈమె టార్గెట్ ఐసిస్ టెర్రరిజంపై పోరాటం.దీంతో ఐసిస్ ఈమె తలపై రూ.9కోట్ల రివార్డ్ ప్రకటించింది..అంతగా ఇంటర్నేషనల్ స్టేట్ ఆఫ్ ఇస్లామిక్ స్టూడెంట్స్‌ని జోయన్నా ఎందుకు భయపెడుతుందో తెలుసా? ఈ స్టోరీ చూడండి

ఐసిస్ ఉగ్రవాదులు చాలామంది సిరియా యువతులను, మహిళలను నిర్బంధించడమే కాకుండా తమ కోరికలు తీర్చుకోవడం, బానిసలుగా ఇతర దేశాలకు అమ్మకం పెట్టారు. ఆ కథనాలు విన్నా, చదివినా మనిషి జీవితం వారి చేతిలో ఎంత దుర్భరంగా బందీ అయిపోయిందో అన్పించకమానదు.అలా వారి చేతిలో చిక్కినవారిలో చాలామందిని ఈ డెన్మార్క్ లేడీ డైనమేటే కాపాడింది. కోపెన్‌హాగన్‌లో పాలిటిక్స్, ఫిలాసఫీ చదువుకుంటున్నఈ బ్యూటీ ఇరాన్-కుర్దిష్ తెగలో పుట్టింది చావుకు ఎదురునిలుస్తారనే పేరున్న పెష్మెర్గా కూతురే ఈమె. అలాంటి నేత కడుపున పుట్టిన జోయన్నా మరి కుదురుగా ఎలా చదువుకుంటుంది..అందుకే 9వ ఏటనుంచే షూటింగ్ ప్రాక్టీస్ చేసేదట. అలా పెరిగి పెద్దైన జోయన్నా కుర్దిష్ ఆర్మీలో నార్త్ సిరియాలో ఐసిస్‌పై పోరాటం మొదలెట్టింది.ఇప్పటిదాకా 100మంది టెర్రరిస్టులను మట్టుబెట్టిందట.

ఉదయం నాలుగు గంటలకే లేవడం ఏకే రైఫిల్స్ ఉన్న ఓ బ్యాగ్ వేసుకుని ప్రాక్టీస్ కి వెళ్తుందట. ఆ బ్యాగ్‌లో రెండు హ్యాండ్ గ్రనేడ్స్ కూడా కంపల్సరీగా ఉంటాయట. ఇక రెండోప్రపంచయుధ్దంలో పాల్గొన్న లేడీ ఆర్మీ స్నిప్పర్  ల్యూడిమిలా పవిల్‌చెన్కో (లేడీ ఆఫ్ డెత్) తన ఇన్స్‌స్పిరేషన్‌గా చెప్తుంది. సదరు ల్యూడిమిలా 309మంది నాజీలను ఆ యుధ్ద సమయంలో మట్టుబెట్టిందట. మరి ఇలాంటి లక్ష్యాలున్న యువతి ఎంత అందంగా ఉంటే మాకేంటని ఐసిస్ ఈమె తలపై రూ.9కోట్ల రివార్డు ప్రకటించింది.ఎవరు ఆమె తలకొడతారో వారికి ఆ డబ్బు ఇస్తుందట.ఐతే ఆ పని జరుగుతుందో లేదో కానీ ఈలోపుల జోయన్నా మాత్రం ఐసిస్ ఉగ్రవాదులను వరసగా నరుక్కుంటూ వెళ్తోంది.ఇంతా చేసి ఈమె వయస్సెంతనుకుంటున్నారు జస్ట్ 23ఏళ్లు.Most Popular