పీక్‌లో ఉన్నా.. ఇంకా పైపైకి వెళ్లే సత్తా ఉన్న స్టాక్స్ ఇవి !

పీక్‌లో ఉన్నా.. ఇంకా పైపైకి వెళ్లే సత్తా ఉన్న స్టాక్స్ ఇవి !

గతేడాది మార్కెట్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. గరిష్ట కనిష్ట స్థాయిల మధ్య భారీగా తేడా ఉన్నా.. ముగింపు మాత్రం అతి స్వల్ప లాభాలకే పరిమితం అయింది. కానీ 2017 ప్రారంభం నుంచి మార్కెట్లు ర్యాలీ చేస్తూనే ఉన్నాయి. ఇండెక్సులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. దీంతో కొన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్ భారీ లాభాలు గడించి ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. వీటిలో మరిన్ని లాభాలకు అవకాశం ఉన్న టాప్-5 మిడ్‌క్యాప్ స్టాక్స్‌ను పరిశీలిద్దాం.

 

ఈ ఏడాది ప్రారంభం నుంచి సెన్సెక్స్, నిఫ్టీలు 6 శాతం పైగా పరుగులు తీశాయి. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ వాల్యుయేషన్ ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అన్ని కంపెనీల మార్కెట్ విలువ కలిపి 116.5 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది. ప్రస్తుతం సెన్సెక్స్ 52 వారాల గరిష్ట స్థాయి అయిన 29,077 పాయింట్లకు కేవలం 2 శాతం దూరంలోనే ఉంది. ‌ఆల్‌టైం గరిష్ట స్థాయికి 30,024 పాయింట్లకు 1600 పాయింట్ల నిలిచింది సెన్సెక్స్. 


ఈ ఏడాది ప్రారంభం నుంచి అనేక స్టాక్స్‌లో ర్యాలీ కనిపిస్తోంది. కొన్ని స్టాక్స్ ఇప్పటికే రెండంకెల వృద్ధిని కూడా నమోదు చేశాయి. దీంతో చాలామంది మదుపర్లు అద్భుతమైన అవకాశాన్ని అందుపుచ్చుకోలేకపోయామనే భావనలో ఉన్నారు. అయితే.. ఇంకా కొన్ని స్టాక్స్ వాల్యుయేషన్‌ పరంగా అతి తక్కువకే లభిస్తూ.. గరిష్ట లాభాలను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి తక్కువ పీఈ విలువ ఉన్న టాప్ 50 స్టాక్స్‌లో.. అత్యధిక లాభాలు పంచే అవకాశం ఉన్న ఐదు స్టాక్స్ వివరాలు చూద్దాం. 

 

ఈ జాబితాలో సౌత్ ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, ఐఆర్‌బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ హౌసింగ్‌ ఫైనాన్స్, ఆయిల్ ఇండియాలు ఉన్నాయి. లోయెస్ట్ ఫార్వార్డ్ పీఈ ఉన్న ఈ షేర్లు, మదుపర్లకు గరిష్ట లాభాలు పంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. 

 

 

వరుస సంఖ్య కంపెనీ పేరు ఫార్వార్డ్ పీఈ పీబీ నిష్పత్తి డివిడెండ్
 ఈల్డ్
పీఈజీ
1 సౌత్ ఇండియన్ బ్యాంక్ 9.35 0.81 2.16 0.37
2 కరూర్ వైశ్యా బ్యాంక్ 9.9 1.23 3.11 0.61
3 ఐఆర్‌బీ ఇన్ఫ్రా 13.09 1.72 1.71 0.69
4 ఇండియా బుల్స్
హౌసింగ్ ఫైనాన్స్
13.78 3.25 4.31 0.37
5 ఆయిల్ ఇండియా 13.78 1.23 3.56 0.53

 

ఫార్వార్డ్ పీఈ & పీఈజీ ఎందుకు ముఖ్యం?
పీ/ఈ లెక్కించేందుకు స్టాక్ ప్రస్తుత ధరను ఎర్నింగ్స్ పర్ షేర్‌తో లెక్కించాల్సి ఉంటుంది.  ఫార్వార్డ్ పీ/ఈ అంటే స్టాక్ ప్రస్తుత ధరను.. అంచనా వేయబడిన ఎర్నింగ్స్ పర్ షేర్‌తో భాగించడం. 

"ఈ స్టాక్స్ చారిత్రక ప్రదర్శన ఇప్పటికే మార్కెట్ వర్గాలకు అంచనా ఉంటుంది. అందుకే ఆ కంపెనీ భవిష్యత్తు ప్రదర్శనపై కూడా అంచనాలు ఉంటాయి. ఇలాంటి సమయంలో పీ/బీవీ, పీ/ఈ లు.. కంపెనీ విలువను లెక్కించేందుకు తగిన ప్రమాణాలుగా భావించవచ్చు”  అని ఏంజెల్ బ్రోకింగ్ వర్గాలు చెబుతున్నాయి. 

ఫార్వార్డ్ పీఈతో పాటు ఆయా రంగాలకు అనుగుణంగా మరిన్ని ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టార్‌కు పీ/పీవీ ని ఉత్తమ ప్రమాణంగా తీసుకోవాల్సి ఉండగా.. వినియోగ రంగ కంపెనీలకు పీ/ఈ ని పరిశీలించాల్సి ఉంటుంది. 'డెట్ కంపెనీలు/ఎసెట్ హెవీ మోడల్స్‌ను ఈవీ/ఎబిటా ఆధారంగా లెక్కించాల్సి ఉంటుంద'ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 

స్టాక్ విలువను లెక్కించడానికి ఈ ప్రమాణాలు ఉపయోగపడతాయి. తక్కువ పీఈ ఉంటే ఆ స్టాక్ కొనుగోలుకు అనుకూలంగా ఉందని చెప్పేందుకు అర్ధం కాదా, తక్కువ పీఈజీ ఉన్న స్టాక్‌ను అండర్ వాల్యూ చేసినట్లుగా గుర్తించాలి. మొత్తంగా ఎంత తక్కువ పీఈ ఉంటే.. పెట్టుబడికి అంత ఉత్తమమైన స్టాక్‌గా చెప్పవచ్చు.
 

(ఇవి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇస్తున్న రికమెండేషన్స్ కావు. కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టేముందు మీ అడ్వైజర్‌ను సంప్రదించండి)Most Popular