సెంట్రల్‌లో 'మ్యాక్స్' అందాలు

సెంట్రల్‌లో 'మ్యాక్స్' అందాలు

నేషనల్ రేంజ్‌ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్. ప్రతి ఏటాలానే మ్యాక్స్ బ్రాండ్  స్ప్రింగ్ కలెక్షన్స్ ను హైదరాబాద్ సెంట్రల్ మాల్ లో ప్రదర్శించింది. అంతర్జాతీయ పోకడలకు అనుగుణంగా తయారుచేసిన ఈ కలెక్షన్స్‌లో మోడల్స్ సందర్శకులను ఆకట్టుకున్నారు. స్ప్రింగ్ సీజన్లో మ్యాక్స్ బ్రాండ్ ఏర్పాటు చేసిన వస్త్రప్రదర్శన హైదరాబాద్ వాసులను ఆకట్టుకుంది. ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్, ఇఁడియన్ వేర్ తో పాటు కిడ్స్ వేర్ ను కూడా ప్రదర్శించడం ఈ కలెక్షన్ ప్రత్యేకత. సిటీలో ప్రస్తుతం సీజన్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. అందుకే ఈ సీజన్లో కొత్త కలెక్షన్ తో ముందుకురావడం చాలా ఆనందానిచ్చిందన్నారు మ్యాక్స్ ఫ్యాషన్ అసిస్టెంట్ వైస్ ప్రసిడెంట్ వివేక్ శర్మ.ఇంపీరియల్ బ్లూ..బార్బడోస్ చెర్రీస్ రెడ్ వంటి ఎలక్ట్రిక్ కలర్స్తో పాటు..నేచురల్ కలర్స్ తో డిజైన్ చేసిన కలెక్షన్స్‌లో మోడల్స్ మెరిసిపోయారుMost Popular