ఈక్లర్క్స్‌ ఫలితాలు ప్చ్‌!

ఈక్లర్క్స్‌ ఫలితాలు ప్చ్‌!

సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ ఈక్లర్క్స్‌ సర్వీసెస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 11 శాతం క్షీణించి రూ. 86 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం కూడా 3 శాతం తగ్గి రూ. 325 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 20 శాతం పడిపోయి రూ. 91 కోట్లకు చేరగా..  ఇబిటా మార్జిన్లు 34 శాతం నుంచి 28 శాతానికి బలహీనపడ్డాయి. ఫలితాల నేపథ్యలో ఈక్లర్క్స్‌ షేరు బీఎస్ఈలో 1.7 శాతం నష్టంతో రూ. 1472 వద్ద నిలిచింది.Most Popular