లిస్టింగ్‌ రోజు బీఎస్‌ఈ బంపర్‌ లాభాలు!!

లిస్టింగ్‌ రోజు బీఎస్‌ఈ బంపర్‌ లాభాలు!!

ఆసియాలోనే అతిపురాతనమైన బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) బంపర్‌ లిస్టింగ్‌ సాధించింది. ఇష్యూ ధర రూ. 806కాగా.. ఎన్‌ఎస్‌ఈలో రూ. 283 లాభం(ప్రీమియం)తో రూ. 1089 వద్ద ట్రేడింగ్‌ మొదలైంది. చివరికి రూ. 264(33 శాతం) లాభంతో రూ. 1070 వద్ద ముగిసింది. సొంత షేర్ల లిస్టింగ్‌కు సెబీ నిబంధనలు అంగీకరించనందున ప్రత్యర్థి సంస్థ నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో బీఎస్‌ఈ లిమిటెడ్‌ పేరుతో షేర్లు లిస్టయ్యాయి. ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోలుకి క్యూకట్టడంతో ఒక దశలో 49 శాతం జంప్‌చేసి అంటే రూ. 394 లాభంతో రూ. 1200ను తాకింది. షేరుకి రూ. 806 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా బీఎస్ఈ రూ. 1243 కోట్లను సమీకరించింది. ఇష్యూకి ఏకంగా 51 రెట్లు అధికంగా స్పందన లభించడం విశేషం. దేశీయంగా 2012లో తొలిసారి ఎంసీఎక్స్‌ షేర్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కాగా, ఈక్విటీ ఎక్స్ఛేంజీగా లిస్టింగ్‌ పొందిన తొలి సంస్థగా బీఎస్‌ఈ ఆవిర్భవించింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకూ లిస్టింగ్‌ పొందిన ఎక్స్ఛేంజీలలో ఎన్‌వైఎస్‌ఈ, నాస్‌డాక్‌, లండన్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ, హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్చేంజీ, డాయిష్‌ బోర్స్‌ వంటివి ఉన్నాయి.Most Popular