ఫిబ్రవరి 3న బీఎస్‌ఈ లిస్టింగ్‌

ఫిబ్రవరి 3న బీఎస్‌ఈ లిస్టింగ్‌

ఇటీవల పబ్లిక్‌ ఇష్యూ చేపట్టిన బొంబాయి స్టాక్‌ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ) షేర్లు శుక్రవారం(ఫిబ్రవరి 3)న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లో లిస్ట్‌కానున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మార్గదర్శకాల ప్రకారం సొంత షేర్ల లిస్టింగ్‌ను చేపట్టేందుకు ఎక్స్ఛేంజీలకు అవకాశంలేకపోవడంతో బీఎస్‌ఈ షేర్లు ప్రత్యర్థి సంస్థ ఎన్‌ఎస్ఈలో లిస్టింగ్ పొందనున్నాయి. ఈ నెల 23-25 మధ్యలో షేరుకి రూ. 806 ధరలో బీఎస్‌ఈ ఇష్యూ నిర్వహించింది. తద్వారా రూ. 1243 కోట్లను సమీకరించింది. ఇష్యూకి అన్ని తరహా ఇన్వెస్టర్ల నుంచీ భారీ స్పందన లభించడం విశేషం. ఇష్యూకి మొత్తంగా 51 రెట్లు అధిక బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల కోటా 49 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌కాగా, సంపన్న వర్గాలు 159 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలు చేశాయి. ఇక రిటైల్‌ విభాగం నుంచి కూడా 6 రెట్లు అధిక దరఖాస్తులు లభించడం చెప్పుకోదగ్గ విశేషం!!Most Popular