జోరుగా హుషారుగా చిన్న షేర్లు

జోరుగా హుషారుగా చిన్న షేర్లు

మార్కెట్ల బాటలో చిన్న షేర్లు కూడా భారీ లాభాలతో పురోగమించాయి. బీఎస్‌ఈలో మిడ్‌ క్యాప్‌ సూచీ మార్కెట్లను మించుతూ 1.4 శాతం జంప్‌చేయగా, స్మాల్‌ క్యాప్‌ 1 శాతం బలపడింది. ట్రేడైన మొత్తం షేర్లలో 1717 లాభపడితే.. 1041 నష్టపోయాయి. మిడ్‌ క్యాప్స్‌లో జిందాల్‌ స్టీల్‌, 3ఎం, యూనియన్‌ బ్యాంక్‌, నాల్కో, సెయిల్‌, ఇండియన్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, అదానీ పవర్‌, ఎంఆర్‌ఎఫ్‌, ఐబీ హౌసింగ్‌, శ్రీరామ్‌ ట్రాన్స్‌, పేజ్‌, మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌, కెనరా, బీవోఐ, హెచ్‌పీసీఎల్, టాటా గ్లోబల్‌ తదితరాలు 9.4-2.5 శాతం మధ్య ఎగశాయి.
స్మాల్‌ క్యాప్స్‌లో...
స్మాల్‌ క్యాప్స్‌లో సుప్రీం ఇన్‌ఫ్రా, ఉషా మార్టిన్‌ 20 శాతం చొప్పున దూసుకెళ్లగా.. హిమత్ సీడే, హైటెక్‌ ప్లాస్ట్‌, ఆర్షియా, మ్యాన్‌ ఇన్‌ఫ్రా, సొమాని సిరామిక్స్‌, దాల్మియా భారత్‌, లిబర్టీ షుస్‌, జెన్‌టెక్‌, రుషీల్‌, నెల్‌క్యాస్ట్‌, సాల్జెర్‌, ప్రకాష్‌, విశాకా, వివిమెండ్‌ తదితరాలు 12-7 శాతం మధ్య జంప్‌చేశాయి. మరోపక్క వీబీ ఇండస్ట్రీస్‌ 18 శాతం కుప్పకూలగా, లిప్సా జెమ్స్‌, ఎంఎస్‌ఆర్‌, ధంపూర్‌ షుగర్స్‌, రేణుకా, ఆరియన్‌ ప్రో, హికాల్‌, ఎస్‌టీసీ తదితరాలు 7-3 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular