వీ2 రిటైల్‌కు బెన్నెట్‌ కిక్‌!

వీ2 రిటైల్‌కు బెన్నెట్‌ కిక్‌!

గత వారం బెన్నెట్‌ అండ్‌ కాల్మన్‌కు 20.35 లక్షల షేర్లను కేటాయించిన వార్తలతో జోరందుకున్న వీ2 రిటైల్‌ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ.135 వద్ద ట్రేడవుతోంది. వెరసి ఆరు ట్రేడింగ్ సెషన్లలో ఈ కౌంటర్ దాదాపు 19 శాతం దూసుకెళ్లింది. రూ. 79.85 ధరలో బెన్నెట్ అండ్ కాల్మన్‌ వారంట్లను ఈక్విటీలుగా మార్పు చేసుకుంది. తద్వారా కంపెనీకి రూ. 16 కోట్లకుపైగా లభించాయి.Most Popular