నిఫ్టీ 100 పాయింట్లు అప్‌

నిఫ్టీ 100 పాయింట్లు అప్‌

యూరప్‌ మార్కెట్లు యథాతథంగా కదులుతున్నప్పటికీ దేశీయంగా మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళుతున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ లాభాల సెంచరీ సాధించింది. 100 పాయింట్లు ఎగసి 8,388ను తాకింది. ఇక సెన్సెక్స్‌ 270 పాయింట్లు జంప్‌చేసి 27,170 వద్ద ట్రేడవుతోంది. ఎఫ్‌ఐఐల అమ్మకాల స్పీడ్‌ తగ్గడంతోపాటు, దేశీ ఫండ్స్‌ పెట్టుబడులు కుమ్మరిస్తుండటంతో సెంటిమెంటుకు బలమొచ్చిన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో బ్లూచిప్స్‌తోపాటు చిన్న షేర్లు సైతం లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 1 శాతంపైగా పుంజుకున్నాయి. Most Popular