సౌత్ ఇండియన్‌ బ్యాంక్‌ క్యూ3 ఓకే

సౌత్ ఇండియన్‌ బ్యాంక్‌ క్యూ3 ఓకే

ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 ఫలితాలు ప్రకటించాక సౌత్ ఇండియన్‌ బ్యాంక్‌ కౌంటర్లో కొనుగోళ్లకు తెరలేచింది. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 3.1 శాతం ఎగసి 21.60 వద్ద ట్రేడవుతోంది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో బ్యాంక్‌ నికర లాభం 10 శాతం పెరిగి రూ. 111 కోట్లను అధిగమించింది. ఇందుకు ఇతర ఆదాయం దోహదపడగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) 2.6 శాతం పెరిగి రూ. 418 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 69 శాతం జంప్‌చేసి రూ. 258 కోట్లకు చేరడంతో నిర్వహణ లాభం కూడా 43 శాతం ఎగసి రూ. 377 కోట్లను తాకింది.Most Popular