సెన్సెక్స్ డబుల్‌ సెంచరీ!!

సెన్సెక్స్ డబుల్‌ సెంచరీ!!

మిడ్‌ సెషన్‌ నుంచీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు మరింత బలపడ్డాయి. సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీ సాధించింది. ప్రస్తుతం 235 పాయింట్లు జంప్‌చేసి 27,135ను తాకింది. నిఫ్టీ సైతం 84 పాయింట్లు ఎగసి 8,373కు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ ఒక్కటే అదికూడా 0.2 శాతం నష్టపోగా, మిగిలిన అన్ని రంగాలూ లాభాలతో ఉన్నాయి. మెటల్‌ 4 శాతం పురోగమించగా, బ్యాంక్‌ నిఫ్టీ 2.2 శాతం ఎగసింది. 
బ్లూచిప్స్‌ దూకుడు
బ్లూచిప్స్‌లో హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్ దాదాపు 6 శాతం చొప్పున దూసుకెళ్లాయి. ఈ బాటలో కోల్ ఇండియా, యస్‌బ్యాంక్‌, బీవోబీ, టాటా స్టీల్‌, అంబుజా, కొటక్‌ బ్యాంక్‌, జీ, లుపిన్‌ 4.6-2 శాతం మధ్య జంప్‌చేశాయి. దీంతో మార్కెట్లకు బలమొచ్చింది. అయితే బజాజ్‌ ఆటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, బాష్‌, టాటా పవర్‌, ఆర్‌ఐఎల్‌, బీపీసీఎల్‌, భారతీ, సిప్లా, టీసీఎస్‌ 0.8-0.2 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular