బ్యాంక్‌ నిఫ్టీ దూకుడు

బ్యాంక్‌ నిఫ్టీ దూకుడు

వడ్డీ రేట్లు తగ్గుతున్న కారణంగా రుణాలకు డిమాండ్‌ ఊపందుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో ఇటీవల బ్యాంక్‌ షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. అటు ప్రయివేట్‌, ఇటు ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్లలో కొనుగోళ్లు పుంజుకోవడంతో తాజాగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంక్‌ నిఫ్టీ దాదాపు 2 శాతం ఎగసింది. ప్రధానంగా ఇండస్‌ఇండ్ 5 శాతం జంప్‌చేసింది. క్యూ3లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించడం ఇందుకు దోహదపడగా.. యస్‌బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంక్, పీఎన్‌బీ, కెనరా, బీవోబీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, స్టేట్‌బ్యాంక్, యాక్సిస్‌, కొటక్‌ మహీంద్రా 3.4-1 శాతం మధ్య ఎగశాయి. దీంతో మార్కెట్లు భారీ లాభాలవైపు పరుగెడుతున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. Most Popular