2106లో మెటల్ షేర్ల హవా!- మళ్లీ కొనసాగుతోంది!!

2106లో మెటల్ షేర్ల హవా!- మళ్లీ కొనసాగుతోంది!!

గడిచిన ఏడాది(2016) దేశీ స్టాక్‌ మార్కెట్లలో కొత్త ట్రెండ్‌ కనిపించింది. గత ఏడేళ్లలో ఎరుగని విధంగా మెటల్‌, ఆయిల్‌ రంగ షేర్లు లాభాల దుమ్ము దులిపాయి. ఇదే సమయంలో మరోపక్క విదేశీ ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఫేవరెట్‌ రంగాలైన ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ), ఫార్మాస్యూటికల్‌ రంగాలు వెనకడుగు వేశాయి. 2016లో బీఎస్‌ఈ మెటల్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 40 శాతం దూసుకెళితే... ఆయిల్‌ అండ్ గ్యాస్‌ రంగం కూడా 26 శాతం జంప్‌చేసింది. 2009 తరువాత మళ్లీ ఈ రంగాలు అత్యధిక స్థాయలో మెరిపించగా, ఇదే కాలంలో ఐటీ 9 సూచీ శాతం, ఫార్మా రంగం 11 శాతం చొప్పున నష్టపోయాయి. వెరసి గత కొన్నేళ్లుగా మార్కెట్లలో కనిపిస్తున్న సీన్‌ గతేడాది రివర్స్‌ అయ్యింది!! అంతేకాదు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించే వినియోగ వస్తువులు, రియల్‌ ఎస్టేట్‌ రంగాలు సైతం 9 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే 2017లోనూ మెటల్‌ షేర్లు రాణిస్తుండటం విశేషం!! తాజాగా చైనా.. మొత్తం స్టీల్‌ ఉత్పత్తిలో 9 శాతానికి సమానమైన మధ్యస్థాయి ఫర్నేస్‌లను దేశవ్యాప్తంగా మూసివేయనున్నట్లు ప్రకటించడంతో మెటల్‌ షేర్లు జోరందుకున్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్‌ తదితరాలు రివ్వున పైకెగశాయి. 
వేదాంతా, హిందాల్కో దూకుడు
గతేడాది మెటల్‌ రంగంలో వేదాంతా 152 శాతం దూసుకెళ్లగా, హిందాల్కో 100 శాతం జంప్‌చేసింది. ఈ బాటలో హిందుస్తాన్‌ జింక్‌ 84 శాతం, టాటా స్టీల్‌ 58 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 55 శాతం చొప్పున ఎగశాయి. ఇక ఇంధన రంగంలో ఇంద్రప్రస్థ గ్యాస్‌ 72 శాతం లాభపడగా, హెచ్‌పీసీఎల్‌ 52 శాతం, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ 52 శాతం, ఇండియన్‌ ఆయిల్‌(ఐవోసీ) 42 శాతం, బీపీసీఎల్‌ 37 శాతం చొప్పున పుంజుకున్నాయి. మెటల్‌ ఇండెక్స్‌ 7,398 పాయింట్ల నుంచి 11,000 స్థాయికి దూసుకెళ్లింది. ఇది దాదాపు 40 శాతం వృద్ధికాగా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీ సైతం 25 శాతం ఎగసి 9,555 స్థాయి నుంచి 12,000 పాయింట్లకు చేరింది. 
కారణాలున్నాయ్
గత కొన్నేళ్లుగా స్థబ్దుగా ఉన్న పలు ప్రాథమిక లోహాల ధరలు గతేడాది అనూహ్యంగా పుంజుకున్నాయి. కోకింగ్ కోల్, ఐరన్‌, మాంగనీస్‌ ఓర్‌, జింక్‌ తదితరాలు భారీగా లాభపడ్డాయి. దీనికితోడు చైనాకు జతగా జపాన్‌ వంటి దేశాల నుంచి వినియోగం పెరగనున్నట్లు అంచనాలు వెలువడ్డాయి. ఇలాంటి అంశాలు మెటల్‌ షేర్లకు జోష్‌నివ్వగా, అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పతనంకావడంతో దేశీయంగా ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల మార్జిన్లు మెరుగుపడ్డాయి. నష్టాల స్థానే భారీ లాభాలు ఆర్జించడంతో హెచ్‌పీసీఎల్‌ వంటి కౌంటర్లు జోరందుకున్నాయి. మరోపక్క ప్రభుత్వం కూడా గ్యాస్‌ ధరలను తగ్గించడం ఇంద్రప్రస్థ వంటి సంస్థలకు మేలు చేకూర్చినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. గతేడాదిలో ప్రాథమిక లోహాలకు డిమాండ్ పెరగడంతో జింక్‌ 70 శాతం జంప్‌చేయగా, అల్యూమినియం 28 శాతం, కాపర్‌ 24 శాతం, లెడ్‌ 17 శాతం చొప్పున ఎగశాయి. అంతిమంగా ఇది మెటల్‌ షేర్లలో ర్యాలీకి దోహదం చేసింది.
ఇదీ జోరు
మెటల్‌ పేరు        లాభ%
జింక్‌                 70
అల్యూమినియం    28
కాపర్                24
లెడ్‌                  17

కంపెనీ పేరు        లాభ% 
వేదాంతా             140
హిందాల్కో           100
హిందుస్తాన్‌ జింక్‌     84
టాటా స్టీల్‌             58
జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌     55
సెయిల్‌                  2Most Popular