దేశీ స్టీల్‌కు చైనీస్‌ మెరుపు

దేశీ స్టీల్‌కు చైనీస్‌ మెరుపు

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మధ్యస్థాయి ఫర్నేసులనూ చైనా మూసివేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఇది 9 శాతం స్టీల్‌ ఉత్పాదక సామర్థ్యానికి సమానంకాగా, దీంతో దేశీయంగా మెటల్‌ రంగం ప్రధానంగా స్టీల్‌ స్టాక్స్‌ జోరందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3 శాతం ఎగసింది. మెటల్‌ షేర్లలో   జేఎస్‌డబ్ల్యూ స్టీల్ దాదాపు 7 శాతం దూసుకెళ్లగా.. సెయిల్‌, జిందాల్‌ స్టీల్‌, టాటా స్టీల్, హిందాల్కో, నాల్కో, వేదాంతా 4.5-2 శాతం మధ్య జంప్‌చేశాయి.Most Popular