అన్ని రంగాలూ లాభాల్లోనే!!

అన్ని రంగాలూ లాభాల్లోనే!!

మార్కెట్లు జోరందుకోవడంతో ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధానంగా మెటల్‌, బ్యాంక్‌, ఆటో, ఫార్మా రంగాలు 1-0.4 శాతం మధ్య పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇండస్‌ఇండ్‌, యస్‌బ్యాంక్‌, హిందాల్కో, భారతీ‌, టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్‌, అల్ట్రాటెక్‌ 3-1 శాతం మధ్య పురోగమించాయి. కేవలం ఐటీసీ, బజాజ్‌ ఆటో, టీసీఎస్‌, బాష్‌ మాత్రమే అదికూడా 0.26-0.17 శాతం మధ్య నష్టాలతో ట్రేడవుతున్నాయి.Most Popular