6 వారాల గరిష్టానికి పసిడి

6 వారాల గరిష్టానికి పసిడి

విదేశీ మార్కెట్లో బంగారం ధరలు మరికొంత బలపడ్డాయి. మంగళవారం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1186 డాలర్లకు చేరింది. ప్రస్తుతం మరో 2 డాలర్లు పెరిగి 1,187.5 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది ఆరు వారాల గరిష్టంకాగా, వెండి నామమాత్రంగా వెనకడుగు వేసింది. ఔన్స్‌ 16.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. 10 గ్రాములు ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ రూ. 93 పెరిగి రూ. 28,144కు చేరగా, వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 408 ఎగసి రూ. 41,096ను తాకింది.



Most Popular