లాభాల్లో ఆసియా మార్కెట్లు

లాభాల్లో ఆసియా మార్కెట్లు

ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 102 స్థాయిలో కదులుతున్నప్పటికీ ఆసియా మార్కెట్లు బలపడ్డాయి. కొరియా 1.6 శాతం జంప్‌చేయగా, హాంకాంగ్‌ 0.8 శాతం, జపాన్‌ 0.36 శాతం చొప్పున పుంజుకున్నాయి. ఈ బాటలో థాయ్‌లాండ్‌, సింగపూర్‌, తైవాన్‌, ఇండొనేసియా స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. అయితే చైనా స్వల్పంగా 0.2 శాతం నష్టంతో కదులుతోంది. నేడు ట్రంప్‌ నిర్వహించనున్న విలేకరుల సమావేశంపై కన్నేసిన ట్రేడర్లు కొత్త పొజిషన్లు తీసుకునేందుకు వెనుకాడకపోవడం గమనించదగ్గ అంశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 
యూకే కొత్త గరిష్టం
యూరప్‌ మార్కెట్లు మంగళవారం సానుకూలంగా ముగిశాయి. ఫ్రాన్స్‌ దాదాపు యథాతథంగా నిలవగా, జర్మనీ 0.2 శాతం బలపడింది. అయితే యూకే స్టాక్స్‌లో కొనుగోళ్లు ఎఫ్‌టీఎస్‌ఈ కొత్త గరిష్టం వద్ద ముగిసేందుకు దోహదపడ్డాయి. వరుసగా రెండో రోజు యూకే స్టాక్‌ సూచీ కొత్త గరిష్టాన్ని అందుకోవడం విశేషం.Most Popular