కొత్త గరిష్టానికి నాస్‌డాక్‌

కొత్త గరిష్టానికి నాస్‌డాక్‌

అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అంఢ్‌పీ-500 యథాతథంగా నిలవగా, డోజోన్స్‌ మరోసారి వెనకడుగు వేసింది. అయితే నాస్‌డాక్‌ కొత్త గరిష్టం వద్ద ముగియడం విశేషం. హెల్త్‌కేర్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ బలపడినప్పటికీ, ఇంధన దిగ్గజాలు బలహీనపడటంతో ఎస్‌అండ్‌పీ 2,269 వద్దే నిలవగా, డోజోన్స్‌ 0.16 శాతం క్షీణించి 19,855 వద్ద ముగిసింది. ఐబీఎం, మెర్క్‌, ఎక్సాన్‌ మొబిల్‌, పీఅండ్‌జీ వంటి బ్లూచిప్స్‌ డీలాపడటంతో డోజోన్స్‌ 20,000 పాయింట్ల మైలురాయి వద్ద మరోసారి చతికిలపడింది. అయితే టెక్నాలజీ దిగ్గజాలు బలపడటంతో నాస్‌డాక్‌ 0.36 శాతం ఎగసి 5,552 వద్ద స్థిరపడింది.Most Popular