లాభాల ఓపెనింగ్‌ నేడు?

లాభాల ఓపెనింగ్‌ నేడు?

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా సింగపూర్‌(ఎస్‌జీఎక్స్‌) నిఫ్టీ 34 పాయింట్లు పెరిగి 8,432 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిబింబిస్తూ ఉంటుంది. మంగళవారం అమెరికా స్టాక్‌ సూచీ డోజోన్స్‌ మరోసారి వెనకడుగు వేసినప్పటికీ నాస్‌డాక్‌ కొత్త గరిష్టం వద్ద ముగిసింది. ఇక యూరప్‌ కూడా లాభాలతో ముగియగా, ప్రస్తుతం ఆసియా మార్కెట్లు రెండు నెలల గరిష్టం వద్ద కదులుతున్నాయి. దీంతో నేడు దేశీయంగానూ సానుకూల ట్రెండ్ కనిపించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 
ట్రంప్‌ సమావేశంపై దృష్టి
అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ట్రంప్‌ నేడు విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావాన్ని చూపగల ట్రంప్‌ అభిప్రాయాలు కీలకంగా నిలవనున్నాయి. వెరసి ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు, పారిశ్రామిక వర్గాలు ట్రంప్‌ వ్యాఖ్యలపై దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. Most Popular