టార్గెట్ 8300 !

టార్గెట్ 8300 !

స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తూ ఇన్వెస్టర్లు, ట్రేడర్లలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. నూతన సంవత్సరం అనేక అంచనాలతో మొదలైన మార్కెట్లు ఆ దిశగానే పరుగులు తీస్తున్నాయి. 8300 పాయింట్ల దిశగా నిఫ్టీ జోరందుకుంది. రెండు నెలల గరిష్ట స్థాయిల దగ్గర ట్రేడవుతున్న మార్కెట్లు ఈ రోజు ట్రేడింగ్‌లో ఆ లెవెల్‌ను క్రాస్ చేసి మరింత పైకి దూసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది. 
అంతర్జాతీయ మార్కెట్ల కూడా కొద్దొగొప్పో మనకు మద్దతును ఇస్తూనే ఉన్నాయి. నిన్న ముగిసిన అమెరికా, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్‌గానే ఉన్నాయి. ఆసియా మర్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్ కొనసాగుతోంది. ఎస్ జి ఎక్స్ నిఫ్టీ 30 పాయింట్లపైన ట్రేడవుతోంది. దీన్ని బట్టి మన మార్కెట్లు కూడా ఈ రోజు గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యే సంకేతాలున్నాయి. సెంటిమెంట్ మార్క్ ఫిగర్ అయిన 8300 పైన నిఫ్టీ ట్రేడ్ అయితే షార్ట్ టర్మ్‌లో మరింత పైకి వెళ్లేందుకు ఆస్కారం కనిపిస్తోంది. 8400-8450 వరకూ సమీపకాలంలో నిఫ్టీ పరీక్షించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రీ బడ్జెట్‌ ర్యాలీ ఎంతవరకూ నిలదొక్కుకుంటుంది అనే ఆందోళన లోలోపల ఉన్నప్పటికీ ఏదో పాజిటివ్ ఫ్యాక్టర్ మార్కెట్లను నడిపిస్తోంది. డీమానిటైజేషన్ తర్వాత బడ్జెట్ పై అంచనాలు పెరిగాయి. ప్రధాని మోడీ అందులో ఏ మాత్రం నిరుత్సాహ పరిచినా కొద్దిగా మార్కెట్లు నెగిటివ్‌గా రియాక్ట్ అయ్యే సూచనలున్నాయి. 

టెక్నికల్ పిక్చర్ - 41 సెషన్స్ తర్వాత నిఫ్టీ గరిష్ట స్థాయిల దగ్గర క్లోజ్ అయింది. స్మాల్ బుల్ క్యాండిల్ ఫార్మ్ చేసింది. 8227-8230 స్థాయిలపైన ఉన్నంత వరకూ మార్కెట్ నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఈ ర్యాలీలో నిఫ్టీ 8300 బ్రేక్ చేసి నిలదొక్కుకోవాలి. అప్పుడు ఇండెక్స్‌కు 8460-8510 దగ్గర గట్టి నిరోధం ఎదురుకావొచ్చు. 
డౌన్ సైడ్ రిస్క్ చూసుకుంటే 8180 - 8150 దగ్గర నిఫ్టీకి పటిష్ట సపోర్ట్ కనిపిస్తోంది. Most Popular