ఎన్ఎస్ఈ లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న టేస్టీ బైట్

ఎన్ఎస్ఈ లిస్టింగ్‌కు సిద్ధమవుతున్న టేస్టీ బైట్

టేస్టీ బైట్ ఈటబుల్స్ స్టాక్‌లో ఒక్కసారిగా జోరు పెరిగింది. బిఎస్ఈలో లిస్ట్ అయిన ఈ స్టాక్‌ త్వరలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో కూడా లిస్ట్ అయ్యేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ఈ నెల 9వ తేదీన బోర్డ్ సమావేశమై నిర్ణయం తీసుకుంది. 
ఈ వార్తల నేపధ్యంలో ఈ స్టాక్ 8.5 శాతం పెరిగి రూ.3840 దగ్గర క్లోజైంది. సాధారణంగా నాలుగు వందలు కూడా మించని వాల్యూమ్స్‌ ఈ రోజు 1600 మార్కును క్రాస్ చేసింది. 
విదేశీ ప్రమోటర్ల దగ్గరే 75 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 4849 అయితే కనిష్ట ధర రూ.1270. 

రెడీ టు ఈట్ నేచురల్ వెజిటేరియన్ ఫుడ్‌ను తయారు చేసే ఈ సంస్థకు యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో అత్యధిక మార్కెట్ ఉంది. టేస్టీ బైట్ పేరుతో బ్రాండ్‌ను మార్కెట్ చేస్తున్న ఈ సంస్థకు విదేశాల్లోనే అత్యధిక పట్టు ఉంది. Most Popular