మార్కెట్ల బాటలోనే చిన్న షేర్లు!

మార్కెట్ల బాటలోనే చిన్న షేర్లు!

మార్కెట్ల బాటలో చిన్న షేర్లలోనూ కొనుగోళ్లు కనిపించాయి. దీంతో బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్ ఇండెక్సులు 0.7 శాతం చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1662 లాభపడితే.. 1151 నష్టపోయాయి. మిడ్‌ క్యాప్స్‌లో ఏబీబీ 13 శాతం దూసుకెళ్లగా, ఎంఆర్‌ఎఫ్‌, నాల్కో, ఎంఆర్‌పీఎల్‌, బీఈఎల్‌, పిరమల్‌, హెచ్‌పీసీఎల్‌, యూనియన్‌ బ్యాంక్‌, కమిన్స్‌, భాతర్‌ ఫోర్జ్‌, అదానీ ఎంటర్‌ఫ్రైజెస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, ఎన్‌ఎల్‌సీ, అదానీ పవర్‌ 4.5-2 శాతం మధ్య ఎగశాయి.
స్మాల్‌ క్యాప్స్‌లోనూ...
చిన్న షేర్లలో స్కిప్పర్‌, క్యాప్లిన్‌ పాయింట్‌, హికాల్, తాజ్‌ జీవీకే, డీసీఎం శ్రీరామ్, ప్రకాష్‌, త్రివేణీ, కిర్లోస్కర్‌ బ్రదర్స్‌, యుకాల్‌ ఫ్యూయల్‌, క్యాపిటల్‌ ట్రేడ్‌, అలంకిత్‌, మధుకాన్‌, శక్తి షుగర్స్‌, కేఈఐ, ఇండోసోలార్‌, బజాజ్‌ హిందుస్తాన్‌ తదితరాలు 13-7 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే కోహినూర్‌, పోకర్ణ, ఎస్‌టీసీ, రామ్‌కీ, స్టాంపీడ్‌, దావత్‌, మోనెట్‌ ఇస్పాత్‌, ఫ్యూచర్‌ లైఫ్‌, లక్స్‌ ఇండస్ట్రీస్‌, గ్యూఫిక్‌ బయో తదితరాలు 6-3.5 శాతం మధ్య పతనమయ్యాయి.Most Popular