రెండు నెలల గరిష్టానికి మార్కెట్లు!  -2 రోజుల నష్టాలకు చెక్‌

రెండు నెలల గరిష్టానికి మార్కెట్లు!  -2 రోజుల నష్టాలకు చెక్‌

వరుస రెండు రోజుల నష్టాలకు చెక్‌ పెడుతూ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 173 పాయింట్లు పెరిగి 26,900 వద్ద నిలవగా, ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 53 పాయింట్లు ఎగసి 8,289 వద్ద స్థిరపడింది. ఇది రెండు నెలల గరిష్టంకాగా, ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ(0.3 శాతం) మినహా అన్నిరంగాలూ పురోగమించాయి. మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ 1.5-0.7 శాతం మధ్య లాభపడ్డాయి. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన దేశీ మార్కెట్లలో ట్రేడర్లు ఫ్రెష్‌ పొజిషన్లు తీసుకునేందుకు ఆసక్తి చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క దేశీ ఫండ్స్‌ భారీ పెట్టుబడులు కూడా సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు చెప్పారు.
మెటల్స్‌ మెరుపులు
బ్లూచిప్స్‌లో హిందాల్కో అత్యధికంగా 4.5 శాతం దూసుకెళ్లగా... టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫ్రాటెల్‌, హీరోమోటో, యస్‌బ్యాంక్‌ 3.6-1.2 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క యాక్సిస్‌, గ్రాసిమ్‌, ఏసీసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, హెచ్డీఎఫ్‌సీ 1-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి.Most Popular