ఇండస్‌ఇండ్‌ ఫలితాలు భేష్‌

ఇండస్‌ఇండ్‌ ఫలితాలు భేష్‌

ప్రయివేట్‌ రంగ బ్యాంకింగ్‌ సంస్థ ఇండస్‌ఇండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో నికర లాభం 29 శాతం పెరిగి రూ. 751 కోట్లను తాకింది. గతేడాది(2015-16) క్యూ3లో రూ. 581 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇక నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) కూడా 35 శాతం జంప్‌చేసి రూ. 1,578 కోట్లకు చేరింది. 21 శాతం అధికంగా రూ. 1017 కోట్ల ఇతర ఆదాయం నమోదైంది. ప్రొవిజన్లు రూ. 177 కోట్ల నుంచి రూ. 217 కోట్లకు ఎగశాయి. కాగా,  త్రైమాసిక ప్రాతిపదికన బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 0.9 శాతం నుంచి 0.94 శాతానికి స్వల్పంగా పెరిగాయి. ఇదే విధంగా నికర ఎన్‌పీఏలు కూడా 0.37 శాతం నుంచి 0.39 శాతానికి పెరిగాయి.నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) 4 శాతంవద్దే నిలకడగా ఉన్నట్లు బ్యాంక్‌ తెలియజేసింది.  ఫలితాల ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఇండస్‌ఇండ్‌ కౌంటర్‌ 0.5 శాతం బలపడి రూ. 1,165 వద్ద ట్రేడవుతోంది.Most Popular