ఎఫ్‌డీఏ ఓకే- హికాల్‌ హైజంప్‌

ఎఫ్‌డీఏ ఓకే- హికాల్‌ హైజంప్‌

బెంగళూరు ప్లాంటులో తనిఖీలు చేపట్టిన యూఎస్‌ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఎలాంటి లోపాలను గుర్తించకపోవడంతో (జీరో అబ్జర్వేషన్స్‌) ఫార్మా సంస్థ హికాల్‌ కౌంటర్‌ రివ్వున పైకెగసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్‌ఈలో 13 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 256 వరకూ దూసుకెళ్లింది. ఇది 52 వారాల గరిష్టంకాగా, కంపెనీలో ప్రమోటర్లు దాదాపు69 శాతం వాటాను కలిగి ఉన్నారు. Most Popular