రివ్వుమన్న గ్లోబల్‌ వెక్ట్రా హెలీ

రివ్వుమన్న గ్లోబల్‌ వెక్ట్రా హెలీ

ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం ఓఎన్‌జీసీ నుంచి రూ. 550 కోట్ల విలువైన ఆర్డర్‌ పొందినట్లు పుకార్లు వెలువడటంతో గ్లోబల్‌ వెక్ర్టా హెలికార్ప్‌ కౌంటర్‌ హైజంప్‌ చేసింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత బీఎస్‌ఈలో రూ. 128 వరకూ దూసుకెళ్లింది. ప్రస్తుతం 4.2 శాతం లాభంతో రూ. 118 వద్ద ట్రేడవుతోంది. కాగా, ఇప్పటికే ఓఎన్‌జీసీకి అందిస్తున్న హెలికాప్టర్‌ సేవల కోసం 2016లో వేసిన టెండర్‌ గత వారాంతాన ఓకే అయ్యిందని, ఇది సాధారణ బిజినెస్‌లో భాగమేనని కంపెనీ బీఎస్‌ఈకి వివరణ ఇవ్వడం గమనార్హం.Most Popular