సెన్సెక్స్‌ 150 పాయింట్లు ప్లస్‌

సెన్సెక్స్‌ 150 పాయింట్లు ప్లస్‌

యూరప్‌ మార్కెట్లు సానుకూలంగా మొదలుకావడంతో దేశీయంగా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించింది. దీంతో ప్రస్తుతం మరింత బలాన్ని పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 157 పాయింట్లు ఎగసి 26,883కు చేరింది. నిఫ్టీ సైతం 44 పాయింట్లు పెరిగి 8,280 వద్ద ట్రేడవుతోంది. తద్వారా సాంకేతికంగా కీలకమైన 8,250ను అధిగమించడంతోపాటు... 8,300 వైపు చూస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగం 0.4 శాతం క్షీణించగా, ఉదయం లాభపడ్డ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లలో అమ్మకాలు కనిపిస్తున్నాయి. అయితే మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాలు 1-0.6 శాతం మధ్య పుంజుకున్నాయి.
బ్లూచిప్స్‌లో...
నిఫ్టీ దిగ్గజాలలో హిందాల్కో దాదాపు 4 శాతం జంప్‌చేయగా, అదానీ పోర్ట్స్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌ఐఎల్‌ 3-1.3 శాతం మధ్య పురోగమించాయి. మరోపక్క యాక్సిస్‌, గ్రాసిమ్‌, అల్ట్రాటెక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ 1.4-0.6 శాతం మధ్య నష్టపోయాయి. Most Popular