శివ సిమెంట్‌ టేకోవర్‌?

శివ సిమెంట్‌ టేకోవర్‌?

ప్రమోటర్ల వాటాను విక్రయించే అంశంపై చర్చించేందుకు శివ సిమెంట్‌ బోర్డు నేడు సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఇందుకు ఒక సిమెంట్‌ కంపెనీ ఆసక్తి చూపుతున్నట్లు శివ సిమెంట్‌ తెలియజేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 37.15 శాతం వాటా ఉంది. 1986లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ ఒడిషాలో ప్లాంటును ఏర్పాటు చేసింది. పోర్ట్‌లాండ్‌ స్లాగ్‌ సిమెంటును ప్రధానంగా తయారు చేస్తోంది. రూ. 2 ముఖ విలువగల ఈ షేరు ప్రస్తుతం బీఎస్‌ఈలో 3.75 శాతం ఎగసి రూ. 13 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 5 శాతం జంప్‌చేసి రూ. 13.15 వద్ద గరిష్టాన్ని తాకింది.Most Popular