కేఈఐ ఇండస్ట్రీస్‌... కేక!

కేఈఐ ఇండస్ట్రీస్‌... కేక!

గత మూడు రోజులుగా లాభాల బాటలో సాగుతున్న కేఈఐ ఇండస్ట్రీస్‌ కౌంటర్ మరోసారి హైజంప్‌ చేసింది. బీఎస్‌ఈలో తాజాగా 7 శాతం దూసుకెళ్లి రూ. 143ను తాకింది. తొలుత రూ. 146 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా, గత మూడు రోజుల్లోనూ ఈ షేరు 16 శాతం లాభపడింది. అత్యంత హైవోల్టేజీ(ఈహెచ్‌వీ) కేబుళ్ల తయారీకి శనివారం కొత్త ప్రొడక్షన్‌ లైనును ప్రారంభించిన నేపథ్యంలో ఈ కౌంటర్‌ జోరందుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రాజస్తాన్‌ అల్వార్‌ జిల్లాలోని చోపంకి ప్లాంటులో వీటిని తయారు చేస్తోంది. ఇందుకు స్విట్జర్లాండ్‌ దిగ్గజం బ్రగ్‌ కేబుల్‌తో సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.Most Popular