బీఈఎల్‌కు రేటింగ్‌ బూస్ట్‌

బీఈఎల్‌కు రేటింగ్‌ బూస్ట్‌

ప్రభుత్వ రంగ దిగ్గజం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌(బీఈఎల్‌)కు విదేశీ బ్రోకింగ్‌ సంస్థ క్రెడిట్‌ స్వీస్‌ ఔట్‌ పెర్ఫార్మర్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ. 1,800 టార్గెట్‌ ధరను ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్‌ జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో బీఈఎల్‌ షేరు దాదాపు 4 శాతం ఎగసి రూ. 1,511 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1527 వరకూ ఎగసింది.Most Popular