చిన్న షేర్లకు డిమాండ్‌

చిన్న షేర్లకు డిమాండ్‌

వరుసగా రెండో రోజు చిన్న షేర్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. సోమవారం మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాటలో సాగినప్పటికీ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లు భారీగా లాభపడ్డ సంగతి తెలిసిందే. నేటి ట్రేడింగ్‌లో మరోసారి చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో మిఢ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.4 శాతం బలపడితే.. స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా 0.6 శాతం ఎగసింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,527 లాభపడితే.. కేవలం 882 నష్టాలతో ఉన్నాయి. కాగా, స్మాల్‌ క్యాప్స్‌లో షుగర్‌ షేర్లు ముందువరుసలో నిలుస్తుండటం విశేషం.
జోరు తీరిదీ...
మిడ్‌ క్యాప్స్‌లో ఎంఆర్‌పీఎల్‌, బీఈఎల్‌, హెచ్‌పీసీఎల్‌, రాజేష్‌ ఎక్స్‌పోర్ట్స్, ఎన్‌ఎల్‌సీ, భారత్‌ ఫోర్జ్‌, ఐబీ హౌసింగ్‌, పిరమల్‌ 5-2 శాతం మధ్య జంప్‌చేయగా.. స్మాల్‌ క్యాప్స్‌లో శక్తి షుగర్‌, త్రివేణీ, బీఈపీఎల్‌, ద్వారికేష్‌, బజాజ్‌ హిందుస్తాన్‌, పుంజ్‌లాయిడ్‌, స్కిప్పర్‌, పంజాబ్‌ కెమ్‌, రేణుకా, దీప్‌ ఇండస్ట్రీస్‌, గ్లోబల్‌ ఆఫ్‌షోర్‌, ఎంబీఎల్‌, ఓరియంట్‌ వినీర్‌, ఎస్‌వోఆర్‌ఐఎల్‌ ఇన్ఫ్రా, ధంపూర్‌ తదితరాలు 8-5 శాతం మధ్య దూసుకెళ్లాయి.  Most Popular