లాల్‌ప్యాథ్, థైరోకేర్‌కూ స్పీడ్ బ్రేకర్లు తప్పవు !

లాల్‌ప్యాథ్, థైరోకేర్‌కూ స్పీడ్ బ్రేకర్లు తప్పవు !

దేశంలోని లిస్టెడ్ స్పేస్‌లో ఉన్న డాక్టర్ ల్యాల్‌ప్యాథ్ ల్యాబ్స్, థైరోకేర్ టెక్నాలజీస్‌ షేర్లు ఈ మధ్యకాలంలో చాలా ఎట్రాక్టివ్‌గా కనిపిస్తూ.. చాలా మంది దృష్టిని తమవైపు తిప్పుకుంటున్నాయి. ప్రైవేట్
ఫండింగ్ కూడా ఎక్కువగా వస్తూ ఉండడంతో ఈ సెక్టార్‌పై అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకూ ఈ సెక్టార్లో ఉన్న ఇద్దరు ప్లేయర్లకు తోడు ఫోర్టిస్ గ్రూపునకు చెందిన ఎస్ ఆర్ ఎల్ డయాగ్నస్టిక్స్‌ కూడా
లిస్టింగ్ కోసం సన్నద్ధమవుతోంది. ఈ ఇండస్ట్రీలో ఎస్ ఆర్ ఎల్.. అతిపెద్ద చైన్ ప్యాథ్ ల్యాబ్ అనడంలో సందేహం లేదు. దీని తర్వాత మెట్రోపొలిస్ హెల్త్ కేర్ కూడా లిస్టింగ్ కోసం వచ్చేందుకు
ఉవ్విళ్లూరుతోంది. 

దీర్ఘకాలంలో ఈ రంగంలోని స్టాక్స్ మెరుగైన పనితీరును కనబరిచే అవకాశం ఉన్నప్పటికీ ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. కఠినమైన నిబంధనలు లేకపోవడం, ఈ
రంగంలోకి అడుగుపెట్టేందుకు పెద్దగా అవరోధాలేవీ లేకపోవడంతో కూడా వృద్ధికి ఆటంకాలు. భారత డయాగ్నస్టిక్ ఇండస్ట్రీలో వ్యవస్థీకృత రంగం వాటా కేవలం 15 శాతం మాత్రమే. అత్యధికంగా అన్
ఆర్గనైజ్డ్ వాళ్లే ఈ ప్యాథ్ ల్యాబ్స్ సెగ్మెంట్లో పటిష్టమైన స్థితిలో ఉన్నారు. 

గత మూడేళ్లలోని డీల్స్ ఒకసారి గమనిస్తే... ఈ రంగంలో పీఈ, వెంచర్ క్యాపిటలిస్ట్స్‌ సంస్థలు 21 డీల్స్ కుదుర్చుకున్నాయి. వీటి విలువ సుమారు 330 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2200
కోట్లు) వరకూ ఉంది. ఇప్పటివరకూ కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చిన్న సంస్థలు కూడా ఇప్పుడు నేషనల్ ప్లేయర్స్‌గా అవతరిస్తున్నాయి. ఇది కూడా పెద్ద సంస్థల వృద్ధికి ఒక అవరోధంలా
మారవచ్చు. బ్రాండింగ్, లాజిస్టిక్స్ వంటి సవాళ్లు ఉన్న నేపధ్యంలో ఈ రంగం ఒత్తిడికి గురవుతోంది. 

డీమానిటైజేషన్ ప్రభావం పెద్దగా కనిపించకపోయినప్పటికీ ప్రభుత్వం కొన్ని టెస్టుల విషయంలో ప్రైస్ క్యాప్ విధించవచ్చు. ఈ మధ్యకాలంలో డెంగ్యూ కేసులు పెరగడంతో ప్రభుత్వం టెస్టుల ధరలపై
ఆంక్షలు విధించింది. ఏదైనా వ్యాధులు ప్రబలినప్పుడు ఇలాంటి సంస్థలు నిర్వహించే పరీక్షలు- వాళ్లు వసూలు చేసే ధరలపై కేంద్రం కూడా ఆంక్షలు విధించే ఆస్కారం ఉంది. 

కొత్త ల్యాబొరేటరీస్‌ ఏర్పాటు చేయడం ఇప్పుడు కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారంలా మారింది. అయితే విస్తరణ చేపట్టలేకపోతే నికర లాభంపై వృద్ధి ఉండదు. అదే ధైర్యం చేసి విస్తరణ చేపడ్తే
మీడియం టర్మ్‌లో మార్జిన్లపై ప్రభావం ఉంటుంది. మార్జిన్లు తగ్గితే పరోక్షంగా వేల్యుయేషన్స్ కూడా తగ్గిపోతాయి. ఇలా వివిధ అంచనాలు - విశ్లేషణలను పరిశీలిస్తే.. రాబోయే రోజుల్లో ఈ రంగం కూడా
దేనికీ మినహాయింపు కాదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. కాంపిటీషన్‌కు తగ్గట్టు వీళ్లూ మారకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 4 ట్రైలింగ్ క్వార్టర్ల ఎర్నింగ్స్‌తో పోలిస్తే.. థైరోకేర్,
లాల్‌ప్యాథ్ స్టాక్స్ సుమారు 50-65 రెట్ల పీఈతో ట్రేడ్ అవుతున్నాయి. 

వీటిన్నింటినీ విశ్లేషిస్తే... రాబోయే రోజుల్లో కాంపిటీషన్ మరింత పెరగబోతోంది. మరిన్ని సంస్థలు సీన్‌లోకి రాబోతున్నాయి. అప్పుడు వేల్యుయేషన్స్ కాస్త తగ్గి ఫ్యాన్సీనెస్ పోతుంది. అందుకే వీటిపై
కూడా అనూహ్యమైన అంచనాలు పెట్టుకోవడం కాస్త రిస్క్‌తో కూడిన వ్యవహారం. Most Popular