హైదరాబాద్ లో దైకిన్ యూనిట్

హైదరాబాద్ లో దైకిన్ యూనిట్

జపనీస్ ఏయిర్ కండీషనర్స్ తయారీ కంపెనీ డైకిన్ తమ మూడోవ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ని 2018లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నామని కంపెనీ తెలిపింది.   హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో డైకిన్ విఆర్‌వి స్మార్ట్ స్టూడియోను డైకిన్ ఇండియా ఎండీ కన్వల్ జీత్ జవా ప్రారంభించారు.  ఇప్పటికే రాజస్థాన్ లోని నిమ్రానాలో తమకు మాన్యుఫ్యాక్చింగ్ యూనిట్ ఉందని రెండవ యూనిట్ ని 40 ఎకరాల్లో 600 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇదే ప్రాంతంలో ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. డైకిన్ ఇండియా గతేడాది 2,750 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించగా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 3,500 కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు కన్వల్ జీత్ అంటున్నారుMost Popular