ఐపీవోకి శంకర బిల్డింగ్‌ రెడీ

ఐపీవోకి శంకర బిల్డింగ్‌ రెడీ

బెంగళూరు సంస్థ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ పబ్లిక్ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి సంపాదించింది. ఇష్యూలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 66 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనుంది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ కార్యకలాపాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఈక్విరస్‌ కేపిటల్‌ తదితర సంస్థలు ఇష్యూని నిర్వహించనున్నాయి.Most Popular