జీఆర్‌ ఇన్‌ఫ్రా ఐపీవోకి సెబీ ఓకే

జీఆర్‌ ఇన్‌ఫ్రా ఐపీవోకి సెబీ ఓకే

పబ్లిక్‌ ఇష్యూ చేపట్టేందుకు జీఆర్‌ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌కు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 240 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇష్యూ కింద 54 లక్షలకుపైగా షేర్లను అమ్మకానికి ఉంచనుంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ తదితర సంస్థలు ఇష్యూని నిర్వహించనున్నాయి. ఐపీవో నిధులను ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) బిజినెస్‌కు అవసరమైన పరికరాల కొనుగోలు, రుణ చెల్లింపు, సాధారణ కార్పొరేట్‌ వ్యవహారాలనకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో తెలియజేసింది.Most Popular