లారస్‌ లేబ్స్‌ లిస్టింగ్ సోమవారం

లారస్‌ లేబ్స్‌ లిస్టింగ్ సోమవారం

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న హైదరాబాద్‌ ఫార్మా సంస్థ లారస్‌ లేబ్స్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో సోమవారం(19న) లిస్ట్‌కానుంది. షేరుకి రూ. 428 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1332 కోట్లను సమీకరించింది. ఇష్యూ మొత్తంగా 4.5 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయిన సంగతి తెలిసిందే. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌) కోటాలో 10.5 రెట్లు, సంపన్న వర్గాల విభాగంలో 3.58 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా, రిటైల్‌ విభాగం నుంచి 1.67 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచింది. నిధులను రుణాల చెల్లింపు, సాధారణ కార్పొరేట్ వ్యవహరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.Most Popular