లారస్ లేబ్స్‌కు 4.5 రెట్లు బిడ్స్‌

లారస్ లేబ్స్‌కు 4.5 రెట్లు బిడ్స్‌

హైదరాబాద్‌ ఫార్మా సంస్థ లారస్‌ లేబ్స్‌ చేపట్టిన పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. గురువారంతో ముగిసిన ఇష్యూకి మొత్తంగా 4.5 రెట్లు అధిక సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. షేరుకి రూ. 426-428 ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1332 కోట్లను సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 2.19 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 9.87 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) కోటా 10.54 రెట్లు సబ్‌స్క్రయిబ్‌కాగా, సంపన్న వర్గాల విభాగం నుంచి 3.58 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇక రిటైలర్ల కోటాలో 1.61 రెట్లు అధికంగా దరఖాస్తులు లభించాయి. పబ్లిక్‌ ఇష్యూకి లభించిన స్పందనకుగాను ఇన్వెస్టర్లకు కంపెనీ సీఈవో సత్యనారాయణ చావ్లా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్‌లోనూ కంపెనీపట్ల ఇన్వెస్టర్లు చూపిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. Most Popular