గాలి రూ. 100 కోట్ల బ్లాక్‌మనీ వేధింపులు: డ్రైవర్ సూసైడ్ నోట్

గాలి రూ. 100 కోట్ల బ్లాక్‌మనీ వేధింపులు: డ్రైవర్ సూసైడ్ నోట్

గాలి జనార్ధన రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి మరీ ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. కర్నాటక స్పెషల్ ల్యాండ్ అక్విజిషన్ అధికారి భీమా నాయక్ దగ్గర పని చేస్తున్న డ్రైవర్ రమేష్ గౌడ, మంగళవారం నాడు విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డమే కాకుండా, మనీ లాండరింగ్ వేధింపులకు సంబంధించిన సూసైడ్ లెటర్‌ కూడా రాశాడు. 

ఈ లేఖలో గాలి జనార్ధన రెడ్డి ఏ విధంగా రూ. 100 కోట్ల బ్లాక్‌మనీని వైట్‌గా మార్చాడనే అంశంపై రమేష్ గౌడ వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై తనకు పూర్తి సమాచారం తెలియడంతో చంపేస్తామనే బెదిరింపులు అందుతున్నట్లు చెప్పాడు. కర్నాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు చెందిన నాయక్, గాలి జనార్ధన రెడ్డికి ఇలా బ్లాక్ మనీ పెళఅలి మార్పించింనందుకు గాను 20 శాతం కమీషన్ పుచ్చుకున్నాడన్నది లేఖలోని సారాంశంగా చెబుతున్నారు. అంతేకాదు ఈ మొత్తాన్ని గాలి కూతురు బ్రాహ్మణి పెళ్లి కోసమే వినియోగించారట.

బీజేపీ ఎంపీ శ్రీరాములు, నాయక్‌లు బెంగళూరు స్టార్ హోటల్‌లో పలు మార్లు కలుసుకున్నారని కూడా ఈ లేఖ చెబుతోంది. ఈ 20శాతం కమీషన్‌తో పాటు 2018 కర్నాటక ఎన్నికల్లో తనకు టికెట్ ఇప్పించాల్సిందిగా కూడా నాయక్ కోరాడట. 

ప్రస్తుతం ఈ కేసులో భాగంగా నాయక్‌పై కేసు నమోదైంది. 
 Most Popular