లారస్‌ లేబ్స్‌ ఐపీవో నేడు

లారస్‌ లేబ్స్‌ ఐపీవో నేడు

హైదరాబాద్‌ ఫార్మా సంస్థ లారస్‌ లేబ్స్‌ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) మొదలుకానుంది. గురువారం(8న) ముగియనున్న ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1332 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. షేరుకి రూ. 426-428 ధరలో చేపడుతున్న ఇష్యూలో భాగంగా కంపెనీ 2.41 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు రూ. 300 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుంది. అర్హతగల కంపెనీ ఉద్యోగులకు ఐపీవో ధరలో రూ. 40 చొప్పున డిస్కౌంట్‌ ఇవ్వనుంది. ఇష్యూలో భాగంగా సోమవారం 25 యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 395 కోట్లకుపైగా సమీకరించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇందుకు గోల్డ్‌మన్‌ శాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ, నోమురా ట్రస్ట్‌ తదితర ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు రూ. 428 ధరలో ఈక్విటీలను కేటాయించినట్లు పేర్కొంది. కంపెనీ 2015-16లో రూ. 1791 కోట్ల ఆదాయం సాధించింది. దీనిపై దాదాపు రూ. 133 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది అంటే 2014-15లో ఆదాయం రూ. 1361 కోట్లుకాగా, రూ. 68 కోట్ల నికర లాభం నమోదైంది.Most Popular