శామ్‌సంగ్‌ సరికొత్త ‘గెలాక్సీ ఆన్‌ నెక్స్ట్‌’ 

శామ్‌సంగ్‌ సరికొత్త ‘గెలాక్సీ ఆన్‌ నెక్స్ట్‌’ 

వీడియోలు, మ్యూజిక్‌, గేమింగ్‌, క్యాబ్స్‌, మూవీస్‌, రీచార్జ్‌, బిల్‌ చెల్లింపులు, ఫుడ్‌ ఆర్డరింగ్‌, ట్రావెల్‌, లోకల్‌ డీల్స్‌ వంటి సర్వీసులను వినియోగించుకునేందుకు మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులు అనేక రకాల యాప్‌లను డౌన్‌లోడ్‌ చేస్తుంటారు. వీటి కోసం మొబైల్‌ ఫోన్‌లో ఎక్కువ స్టోరేజ్‌ అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి యాప్‌లతో కూడిన సరికొత్త మై గెలాక్సీ యాప్‌ను శామ్‌సంగ్‌ విడుదల చేసింది.  అలాగే గెలాక్సీ ఆన్‌ శ్రేణిలో ‘గెలాక్సీ ఆన్‌ నెక్స్ట్‌’ స్మార్ట్‌ఫోన్‌ను శామ్‌సంగ్‌ సోమవారం విడుదల చేసింది. 5.5 అంగుళాల తాకే తెర, తెరను రక్షించే 2.5 డి గొరిల్లా గ్లాస్‌, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీతో పాటు 256 జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఈ ఫోన్‌లో ఉన్నాయని శామ్‌సంగ్‌ ఇండియా ఎలక్ట్రానిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అసిమ్‌ వార్సీ తెలిపారు. ఈ ఫోన్‌లోని ‘ఎస్‌ పవర్‌ ప్లానింగ్‌’ సదుపాయం వల్ల మన నిర్దేశించుకున్న స్థాయికి బ్యాటరీ ఛార్జింగ్‌ తగ్గితే.. మిగిలిన పవర్‌ను కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లకు మాత్రమే ఫోన్‌ వినియోగించుకునే సదుపాయం వుందని అయన తెలిపారు. Most Popular