విస్తరణ బాటలో జిల్‌మోర్

విస్తరణ బాటలో జిల్‌మోర్

మొబైల్‌ యాప్‌ జిల్‌మోర్‌ ద్వారా ఆర్టిస్టులను బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్న హైదరాబాద్‌ సంస్థ జిల్‌మోర్‌ విస్తరణ బాట పట్టింది. ఇప్పటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కార్యకలాపాలుసాగించిన ఈ సంస్థ తాజాగా యుఎస్ఎ, యుకెలో ఫ్రాంచైజీలను ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల కాలంలో మలేషియా, సింగపూర్‌, యుఎఇ, దుబాయ్‌, కెనడా, స్విట్జర్లాండ్‌లో కూడా ఫ్రాంచైజీలను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉంది. విస్తరణ కోసం కోటి రూపాయలు సమీకరించినట్టు జిల్‌మోర్‌ సహ వ్యవస్థాపకుడు, సిఇఒ సారథి బాబు రసాల తెలిపారు. ఇప్పటికే తమ ప్లాట్‌ఫామ్‌లో 500 మంది కళాకారులు నమోదు చేసుకున్నారని, గత పది నెలల కాలంలో 350కి పైగా బుకింగ్స్‌ జరిగాయని ఆయన చెప్పారు. ప్రతిభ ఉండీ, గుర్తింపు రాని కళాకారులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని, తమ కళకు సంబంధించిన వీడియోలు పెడితే అందరికీ తెలుస్తుందన్నారు. జిల్‌మోర్‌ ఫ్రాంచైజీ తీసుకోవడం ద్వారా కొత్త వ్యాపారవేత్తలుగా మారేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. Most Popular