బడ్జెట్ నెల ముందుగానే ఎందుకు ?

బడ్జెట్ నెల ముందుగానే ఎందుకు ?

కేంద్రంలో అధికారపగ్గాలు చేపట్టిననాటి నుంచి పరిపాలనలో పాత పద్దతులను పక్కనబెట్టి..కొత్త పుంతలు తొక్కించాలని ఉవ్విళ్లూరుతున్న కేంద్రం ఇప్పుడు బడ్జెట్ విషయంలోనూ అదే బాట పట్టింది..మామూలుగా బడ్జెట్ అంటే ఫిబ్రవరి నెలాఖరులో మార్చి మొదటి వారం మధ్యలో ఖచ్చితంగా ఓ రోజున ప్రవేశపెట్టడం జరుగుతోంది..కానీ ఈసారి మాత్రం కేంద్రబడ్జెట్ ఓ నెల ముందుగానే ప్రవేశపెట్టాలనుకుంటోంది కేంద్రం..అందుకు సంబంధించి ఈ వారంలోనే కేంద్రమంత్రివర్గం 2017-18 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కూర్పుపై చర్చించనుంది..ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అఁశంపై ఓ నిర్ణయం తీసుకోనుంది..వచ్చే ఏడాదిలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎలక్షన్ కమిషన్ కోడ్ అడ్డంకి గా మారకుండా ఈ జాగ్రత్త తీసుకోనుంది కేంద్రం..ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బడ్జెట్ డేట్ ఉండటంతో ఇందుకోసమే ఈసీ అనుమతి కోరనుంది కేంద్రం

 
ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీతో భేటీ అనంతరం ప్రధాని మోడీ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది..వచ్చే ఏడాదికి రైల్ బడ్జెట్ విడిగా కాకుండా సాధారణ బడ్జెట్‌లోనే కలిసి ప్రవేశపెట్టనుండటంతో బడ్జెట్ అంశంపై అందరిలో ఇప్పట్నుంచే ఆసక్తి మొదలైంది..ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా..నిధుల ఖర్చుపెట్టడమనే ప్రక్రియ అక్టోబర్ నెల నుంచి ప్రారంభమవుతుందని..అప్పటికల్లా ఋతుపవనాల సీజన్ ముగుస్తుంది..అందుకే అన్నివర్గాలకి మేలు జరగాలంటే ఏప్రిల్ కల్లా నిధులు అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ గతంలోప్రకటించారు..అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్లాన్ చేసుకుంటోంది.పార్లమెంట్ సమావేశాలు కూడా జనవరి 25 నుంచి మొదలు పెట్టి మధ్యలో ఓ మూడువారాల విరామం తర్వాత తిరిగి రెండో విడత సెషన్స్ కొనసాగించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిందిMost Popular