భారీ విస్తరణ దిశగా డాక్టర్ అగర్వాల్  ఐ హాస్పిటల్

భారీ విస్తరణ దిశగా డాక్టర్ అగర్వాల్  ఐ హాస్పిటల్

డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ భారీ విస్తరణ పై ద్రుష్టి సారించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ మదీనా గూడలో తమ ఆరవ క్లీనిక్ ను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సినీ నటుడు నాగ చైతన్య హాజరైయ్యారు. దేశవ్యాప్తంగా తమకు 66 క్లీనిక్ లున్నాయని..2020 కల్లా 150 సెంటర్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ డైరెక్టర్ అశ్విన్ అగర్వాల్ తెలిపారు. ఒక్కో క్లీనిక్ కోసం సుమారు 5 కోట్ల రూపాయల మేర ఇన్వెస్ట్ చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రస్తుతం తమ క్లీనిక్స్ లో 6 వేల పై చిలుకు ఉద్యోగులున్నారని అశ్విన్ అంటున్నారు.
 Most Popular